26, మార్చి 2013, మంగళవారం

దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sachin

దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sachin
పుస్తక పరిచయం సమీక్ష సభ
రేగళ్ళ సంతోష్ కుమార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వ్యక్తిత్వచిత్రణ ‘ దేవుణ్ణి మర్చిపోదామిక....forget the God...remember Sachin పుస్తక పరిచయం సమీక్ష సభ ఈ నెల 29 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వైజాగ్ బుక్ లవర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ పౌరగ్రంథాలయంలో జరుగుతుంది.
ప్రొఫెసర్ అశోక్ జయంతి,సాహితీవేత్త ఆచాళ్ల శ్రీనివాసరావు ఈ పుస్తకాన్ని సమీక్షిస్తారు.
అందరికీ ఆహ్వానం.
భవదీయుడు
రాజేంద్ర
98660 21972

22, మార్చి 2013, శుక్రవారం



వైజాగ్ బుక్ లవర్స్ క్లబ్ మీకు ఆహ్వానం పలుకుతోంది.


మితృలకు అభివాదాలు.
సాహిత్యప్రియులతో పాటు పుస్తకాలను  అభిమానించే ప్రతివారి ఆకాంక్షలకు అనుగుణంగా  ఏర్పడ్డదే మన ఈ క్లబ్.మంచి పుస్తకాలను  ప్రోత్సహించటం,రచయితలు,కవులు,గ్రంథకర్తలు,ప్రచురణకర్తలు,సమీక్షకులు,విమర్శకులు,ముద్రణాలయాల వారు,పంపిణీదారులు,విక్రేతలు ఇలా ప్రతివారితోనూ పాఠకులు ముఖాముఖి మాట్లాడేవేదికను కల్పించంటంలో ఒక సాధనంగా పనికిరావాలన్నది మన క్లబ్ ఆశయాలలో ఒకటి.చాలావరకు పుస్తకావిష్కరణ సభలు ప్రచారవేదికలుగానూ,సమీక్షలు వ్యాపారప్రకటనలుగానూ క్షీణరూపాంతరం చెందుతూ,నానాటికీ అడుగంటుతున్న పాఠకుల సంఖ్యను మరింతగా కృశింపజేస్తున్న వికృతధోరణికి విరుగుడుగా ఏర్పడిందే మన ఈ క్లబ్.
   సుమారు పన్నెండువరకూ భాషాసంస్కృతులు ఉన్న విశాఖనగరములో పాఠకులద్వారా జాతీయసమైక్యతకు మరింతగా ఊపిరులూదాలని చేస్తున్న ఒక చిరు ప్రయత్నమే మన ఈ క్లబ్.అద్భుతమైన సాహితీవారసత్వాన్ని కలిగిఉన్న ఈ నగరంలో గతవైభవకీర్తులనూ,దివంగతసాహితీమూర్తులను స్మరించుకుంటూనే,వర్తమాన,వర్థమాన రచయితల స్వంతగొంతులను పాఠకజనావళికి పరిచయం చేయటం మన క్లబ్ కార్యకలాపాలలో ప్రధానమైనది.
పుస్తకపు ప్రాముఖ్యాన్ని మరచిపోతున్నవారికి మరొక్కసారి జ్ఞాపకం చెయ్యటం,బాలలు,యువతను
పుస్తకాలవైపు మళ్ళించేందుకు మొదటిదశ ఈ క్లబ్ స్థాపన.
ఎన్ని సాంకేతికసౌలభ్యాలు సమకూరినా హస్తభూషణం వంటి పుస్తకాన్ని చేతపుచ్చుకు చదవటంలోని
మధురిమను  మరొకమారు పరిమళింపజేయాలన్న మా ఆశయానికి ప్యూపాదశ ఈ క్లబ్.స్థానికులైన సాహితీవేత్తలతోపాటు నగరానికొచ్చిన రచయితలతో ఆత్మీయసమావేశాలు నిర్వహించటం,ఆహ్లాదకరవాతావరణములో పుస్తకావిష్కరణలూ,పుస్తకపరిచయాలు జరపటం,పాఠకులు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను రకరకాల మాధ్యమాల ద్వారా వెల్లడించేలా ప్రోత్సహించటం,వాటికి సమాధానాలను రాబట్టటం వంటి టు వే కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రతిష్ఠించటం మన ఈ క్లబ్ ధ్యేయం.
అవకాశమున్న ప్రతివారూ హాజరయ్యేందుకు ప్రయత్నించండి.పొరుగూర్ల నుండి విశాఖ వస్తున్న వారు కనీసం ఒక పదిరోజుల ముందు తెలియజేస్తే ఏర్పాట్లు సమగ్రంగా చేసేందుకు అవకాశముంటుంది.
మీ అందరి సహాయసహకారాలను అర్థిస్తూ
భవదీయుడు
రాజేంద్ర కుమార్
98660 21972.